ఆసిఫాబాద్: గడువులోగా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కీలకమని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం మీ సేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల ఆపరేటర్లతో స మీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యుల ఈ కేవైసీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. ప్ర జలకు అసౌకర్యం కలగకుండా ఆధార్ అప్‌డేట్ పూర్తి చేయడం ఆపరేటర్ల బాధ్యతన్నారు. అధికారులు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఈ– డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతంరాజ్, డీఎం జి.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


