ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భా గంగా నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస, డ్యాన్స్, పాటల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు సోమవారం డీఎస్పీ అశోక్‌తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్యంతో చదివితే తప్పక విజయం సాధిస్తారని తెలిపారు. కా ర్యక్రమంలో ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


