భూగర్భ జలాల పెంపునకు మున్సిపల్ శాఖ చర్యలు పట్టణ ప్రజలకు విస్తృతంగా అవగాహన సెల్ఫీ పాయింట్, అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు
కాగజ్‌నగర్‌టౌన్: భూగర్భ జలాలు అడుగంటుతు న్న నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీటిని పొదుపుగా వాడుకోవడంపై పట్టణాల్లోని ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ది రెయి న్ డిజిటల్ ఫ్లెక్సీలు కార్యాలయ ఆవరణలో ఏర్పా టు చేశారు. అలాగే క్యాచ్‌ది రెయిన్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ ప్రచా రం చేస్తున్నారు. పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. 20వేలకు పైగా గృహాలు ఉండగా, 70 వేలకు పైగా జనాభా ఉంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పట్టణ ప్రజ లు, అధికారులు సెల్ఫీలు దిగుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా అకౌంట్లలో అప్‌లోడ్ చేస్తుండడంతో వైరల్‌గా మారుతోంది.
అందరూ భాగస్వాములు కావాలి
నీట సంక్షోభాన్ని అధిగమించేందుకు నీటిని పొదుపుగా వాడుకునే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలి. పట్టణ ప్రజలు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇళ్లతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కూడా రూఫ్‌టాప్ రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
– తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్
నీటి సంరక్షణ చర్యలివే..
రూఫ్ టాప్ హార్వెస్టింగ్: ఇంటి పైకప్పు నీటిని పైపుల ద్వారా బోరులోకి లేదా ట్యాంక్‌లోకి మళ్లించాలి.
రీచార్జ్ పిట్: ఇంటి ఆవరణలో చిన్న గుంత తీసి వర్షపు నీటిని భూమిలోకి పంపించాలి.
నీటి వృథాను అరికట్టడం: లీకేజీ ట్యాప్‌లు సరిచేయడం, అవసరానికి మించి నీటిని వాడకుండా ఉండడం. సమీపంలోని చెరువులు, కుంటల పరిశుభ్రతలో పాల్గొనడం.


