ప్రతీ ఫిర్యాదు పరిష్కరించేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఫిర్యాదు పరిష్కరించేందుకు చర్యలు

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

ఆసిఫాబాద్‌: ప్రతీ ఫిర్యాదును చట్టబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత

ఆసిఫాబాద్‌: మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీ సు శాఖ తొలి ప్రాధాన్యత కల్పిస్తుందని ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. జూలైలో జిల్లావ్యాప్తంగా షీటీం ఆధ్వర్యంలో 30 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ పోక్సో చట్టం, మహిళల భద్రత అంశాలపై అవగాహన కల్పించామన్నారు. 98 హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించి 9 మందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. 12 ఫిర్యాదులు స్వీకరించగా ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, రెండు కేసుల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. వేధింపులు, హింస, సైబర్‌ వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా ఆసిఫాబాద్‌ డివిజన్‌ షీటీం 87126 70564, కాగజ్‌నగర్‌ డివిజన్‌ షీటీం 8712670565 లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement