జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్‌లో తొలకరి చిరుజల్లులు మాత్రమే పడగా, జూలైలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవలేదు. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే మోస్తారు వర్షపాతం నమోదవుతోంది.
పగటి ఉష్ణోగ్రతలు కూడా 35 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటంతో సాగుపై ప్రభావం పడుతోంది. వరదతో గలగలా ఉరకలు వేయాల్సిన ఒర్రెలు, వాగులు వెలవెలబోతున్నాయి. పత్తి, సోయా, మొక్కజొన్న చేలు నెర్రలుబారుతుండగా, వేడికి వరినారు మాడిపోతోంది. – చింతలమానెపల్లి
పారని యేరు
ఎదగని నారు


