ఆరుతడి సాగే మేలు
ఆసిఫాబాద్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఆరుత డి పంటల సాగే మేలని కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండకపోవడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉండడంతో వరి సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలి పారు. రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కంది వంటి ఆరుతడి పంట లు సాగు చేయడం ద్వారా నష్టాలు అధిగమించవ్చన్నారు. ఈ నెల 31 వరకు కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఆగస్టు మొదటి వారంలో కందులు, ఉలువలు, అవిశలు, ఆము దం, నువ్వులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విత్తుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుదని తెలిపారు. ఈ వానాకాలం జిల్లాలో 47,576 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో 22,876 ఎకరాలు బోరుబావుల ఆధారంగా, 24,700 ఎకరాలు చెరువులు, కుంటలు, వర్షాధారంపై పండిస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయ అధికారుల సూచన ప్రకారం పంట ల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు విధానాలు, సాంకేతిక సూచనలు తీసుకోవాలని తెలిపారు.


