ప్రిన్సిపాల్‌, పీఈటీ మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌, పీఈటీ మాకొద్దు

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

● కాగజ్‌నగర్‌లో ఎంజేపీ విద్యార్థుల ఆందోళన

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌ జయశ్రీ, పీఈటీ సుదర్శన్‌ వేధిస్తున్నారని విద్యార్థులు సోమవారం సాయంత్రం రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌, పీఈటీలు మాకొద్దంటూ నినాదాలు చేశారు. నెల రోజులుగా పీఈటీ విద్యార్థులను కట్టెతో కొడుతున్నారని, బయటి నుంచి గుట్కాలు తెచ్చి విద్యార్థుల ట్రంక్‌ బాక్సుల్లో వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ విద్యార్థి సూపర్‌ వాస్మోల్‌ తాగిన విషయం బయటకు రాకుండా విద్యార్థులను బెదిరించారని వాపోయారు. ప్రశ్నించిన వారికి టీసీలు ఇచ్చి పంపిస్తున్నారని, ఇప్పటివరకు 20 మందికి టీసీలు ఇచ్చి పంపించారని తెలిపారు. విషయం తెలుసుకుని ఎస్సైలు రాజు, సందీప్‌ విద్యార్థులను సముదాయించి పాఠశాలలోకి పంపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ జయశ్రీని వివరణ కోరగా సన్మార్గంలో ఉంచేందుకు కఠినంగా వ్యవహరించడంతోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వీడియో కాల్‌ ద్వారా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement