● జిల్లావ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు ● జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, ఎమ్మెల్యే తనయుడు కోవ సాయినాథ్, సాయి శ్రావణ్, అరవింద్ లోఢా, నిసార్ పాల్గొన్నారు.
● డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, కౌన్సిలర్లు అబ్దుల్లా, కార్తీక్, వినోద్, భారతి, రాజేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
● గాంధీ చౌక్‌లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలువేరు వెంకన్న మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్‌తో కలిసి ప్రారంభించారు. ప్రతినిధులు ఎకిరాల శ్రీనివాస్, గుండ వెంకన్న, ప్రమోద్, కాచం వినేశ్, రావుల శంకర్, మురళీధర్, వెంకన్న, ఉదయబాబు, బాల శ్రీనివాస్, కొలిప్యాక శంకర్, ఆశిష్ పాల్గొన్నారు.
● జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయి మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీకాంత్, ధర్మయ్య, మహిళా అధ్యక్షురాలు పుష్పలత, జయ, రేవతి, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా గురువారం శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలు ఇంటి ముంగిళ్లకు మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త బట్టలు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో అర్చకులు ఒఝల శిరీష్ శర్మ, కేశవనాథ ఆలయం, శిర్డీ సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధుకర శర్మ, శివకేశవ మందిర్‌లో పూర్ణచందర్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పల్లెల్లో రైతులు వ్యవసాయ పనిముట్లు, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు.
కెరమెరి: దనోరాలో అరక దున్నుతున్న రైతు
జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నేతలకు ఉగాది పచ్చడి అందిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్ నాయకులు
కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ