సింగరేణి సంస్థ మనుగడకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సింగరేణి సంస్థ మనుగడకు కృషి చేయాలి

Mar 20 2026 8:20 AM | Updated on Mar 20 2026 8:20 AM

రెబ్బెన: తెలుగు నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో సింగరేణి సంస్థ మనుగడ పెంచేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇ వ్వాలన్నారు. బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యతలో ముందుందని, భావి తరాలకు సంస్థను అందించాలంటే ప్రతీ ఉ ద్యోగి నిబద్ధతతో పనిచేయాలని సూచించా రు. గోలేటి ఉపరితల గని అనుమతులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శేషశయనరా వు, ఏరియా ఇంజినీర్‌ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్‌, పర్సనల్‌ డిపార్టుమెంట్‌ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement