కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సర్‌సిల్క్ కా లనీలో గల ఎఫ్ క్వార్టర్స్‌లో గురువారం జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. అండర్– 17 బాలురు విభా గంలో ఏ.ప్రేమ్, యశ్వంత్, దీక్షిత్, బాలికల విభాగంలో సంజన, అండర్–19 విభాగంలో సాయికృష్ణ, దిలీప్‌ను ఎంపిక చేసినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ శివనాయర్, అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. మార్చి 22, 24 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందించారు.


