21న ‘సేవ్‌ సింగరేణి జాత’ | - | Sakshi
Sakshi News home page

21న ‘సేవ్‌ సింగరేణి జాత’

Mar 20 2026 8:20 AM | Updated on Mar 20 2026 8:20 AM

రెబ్బెన: సంస్థ పరిరక్షణే ధ్యేయంగా గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించే సేవ్‌ సింగరేణి జాతను ఈ నెల 21న ప్రారంభిస్తున్నట్లు ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి తెలిపారు. గోలేటిలోని కేఎ ల్‌ మహేంద్రభవన్‌లో గురువారం ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ పిలుపు మేరకు అన్ని డిపార్టుమెంట్లలో గేట్‌ మీటింగ్‌లు నిర్వహించిన అనంతరం వందలాది మంది కార్మికులతో గోలేటి కేంద్రంగా ఉదయం 8 గంటలకు జాత ప్రారభమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సేవ్‌ సింగరేణి జాతకు యూనియ న్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు జగ్గయ్య, రాజేశ్‌, కిరణ్‌బాబు, మారం శ్రీనివాస్‌, ఫిట్‌ కార్యదర్శి మల్లేశ్‌, నాయకులు అంజయ్య, నరేశ్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement