పుర ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

పుర ఓటర్లు

Jan 3 2026 6:53 AM | Updated on Jan 3 2026 6:53 AM

పుర ఓటర్లు

పుర ఓటర్లు

పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే అధికం ముసాయిదా జాబితా విడుదల చేసిన మున్సిపల్‌ అధికారులు ఈ నెల 10న తుది జాబితా

@ 65,110

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. కాగజ్‌నగర్‌ బల్దియా ఓటరు జాబితాను గురువారం విడుదల చేయగా, నూతన మున్సిపాలిటీ ఆసిఫాబాద్‌ జాబితా విడుదలలో మాత్రం జాప్యం జరిగింది. తీవ్ర కసరత్తు చేసిన అధికారులు ఎట్టకేలకు శుక్రవారం జాబితాను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నెల 5న మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

కాగజ్‌నగర్‌ బల్దియాలో ఎక్కువ మంది

జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 65,110 ఉండగా.. ఇందులో 33,985 మంది మహిళలు, 31,125 మంది పురుషులు ఉన్నారు. కాగజ్‌నగర్‌ పరిధిలో 51,205 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 మంది, ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు. గత ఎ న్నికల సమయంలో ఇక్కడ 44,946 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి 6,295 మంది పెరిగారు. ఇక నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 13,905 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 6,811 మంది, మహిళలు 7,092 ఉన్నారు. 15, 16 వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు!

ఈ సారి మున్సిపల్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ బ్యాలెట్‌ బాక్స్‌ల స్టాకు వివరాలను జిల్లా అధికారుల నుంచి ఆరా తీస్తోంది. 2019లో మున్సిపల్‌ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పద్ధతినే అనుసరించారు.

ముసాయిదా జాబితా ప్రకారం ఆసిఫాబాద్‌ ఓటర్లు

వార్డు నం. పురుషులు మహిళలు మొత్తం

01 393 480 873

02 233 218 451

03 325 313 638

04 387 343 730

05 383 425 808

06 487 473 960

07 375 394 769

08 338 350 688

09 293 352 645

10 292 341 633

11 295 281 576

12 241 252 493

13 318 293 611

14 362 336 698

15 359 354 714

16 396 451 848

17 301 333 634

18 328 362 690

19 343 330 673

20 362 411 773

మొత్తం 6,811 7,092 13,905

ఆసిఫాబాద్‌అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం నోడల్‌ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే విధులు కేటాయించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్‌ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా సబ్‌ కలెక్టర్‌, ఆసిఫాబాద్‌కు నోడల్‌ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను డీటీడీవో రమాదేవి, వాహనాలు సమకూర్చేందుకు జిల్లా రవాణా అధికారి, అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి జిల్లా ఉద్యానవన అధికారి అబ్దుల్‌ నదీమ్‌, ఎన్నికల పరిశీలకులకు జిల్లా మార్కెటింగ్‌ అధికారి అశ్వక్‌ అహ్మద్‌, బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌, మీడియా కమ్యూనికేషన్‌కు డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌ నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రతిరోజూ నివేదికలు సమర్పించే నోడల్‌ అధికారులుగా మున్సిపల్‌ కమిషనర్లు ఉంటారని తెలిపారు. అధికారులు మున్సిపల్‌ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌, నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌లు గజానంద్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement