రహదారి భద్రతపై అవగాహన తప్పనిసరి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన తప్పనిసరి అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి రహదారి దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారి నియమాలు పాటించాలన్నారు. తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఐఈవో రాందాస్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ
జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శుక్రవా రం డీఏవో వెంకటితో కలిసి దుప్పట్లు పంపిణీ చేశా రు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన విద్యార్థిని ఆర్తిని అభినందించారు. కార్యక్రమంలో ఏవో మిలింద్ తదితరులు పాల్గొన్నారు.


