జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆద ర్శ క్రీడాపాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ మీనారెడ్డి, కోచ్ అరవింద్ శుక్రవారం తెలిపారు. వా రు మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఎస్ జీఎఫ్ అండర్– 14 హ్యాండ్‌బాల్ పోటీల్లో తుకుబా యి, మహేశ్వరి ప్రతిభ చూపారని అన్నారు. ఈ నెల 5 నుంచి 10 వరకు రాజస్తాన్‌లో జరిగే జాతీ యస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
జాతీయస్థాయి సెపక్ తక్రా పోటీలకు..
రెబ్బెన: పంజాబ్‌లోని ఎల్‌పీ యూనివర్సిటీలో శనివారం నుంచి ఈ నెల 5 వరకు జరిగే జాతీయస్థాయి సెపక్‌తక్రా పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారని సెపక్‌తక్రా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ శుక్రవారం తెలిపారు. జూనియర్ బాలబాలికల పోటీలకు రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి చాప్లె శ్రీకాంత్, ఆసిఫాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలకు చెందిన అజ్మీర కీర్తి ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులను సెపక్‌తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ చీఫ్ ప్యాట్రాన్ ఆర్.నారాయణరెడ్డి, సెపక్‌తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, ఎగ్జిక్యూటివ్ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.తిరుపతి అభినందించారు.
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక


