పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్‌అర్బన్: విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్‌లో పనిచేస్తున్న ఏఆర్ ఎస్సై జగదీశ్ చంద్రమండల్ గతేడాది గుండెపోటుతో మరణించగా, శుక్రవారం బాధిత కుటుంబానికి పోలీసు కార్యాలయంలో రూ.99,800 విలువైన చెక్కు అందించారు. కుటుంబ ప్రస్తుత స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌ఐ అడ్మిన్ వామనమూర్తి, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.


