‘ఆపరేషన్ స్మైల్– 12’కు శ్రీకారం
పెంచికల్‌పేట్: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా అధికారులు ఆపరేషన్ స్మైల్ 12వ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన తనిఖీలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. బాలకార్మికుల స్థావరాలుగా నిలిచే వ్యాపార సముదాయాలు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పారిశ్రామిక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టనున్నారు. బాల కార్మికులను విముక్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నాలుగేళ్లలో 269 మందికి విముక్తి
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో పోలీసు అధికా రులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కులు పరి రక్షణ సమితి, విద్యాశాఖ సమన్వయంతో ఆసిఫా బాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ బృందానికి ఎస్సై ముత్యం, కాగజ్‌నగర్ బృందానికి ఎస్సై యా దగిరి నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాలో ఏటా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారిన వారికి అధికారులు కొత్తదారి చూపుతున్నా రు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కా ర్యక్రమాలతో అధికారులు ఇప్పటివరకు 269 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. వీరిలో బాలు రు 251 మంది, బాలికలు 18 మంది ఉన్నారు.
బాలలను పనిలో పెట్టుకుంటే కేసులు
బాలలకు భరోసా కల్పించడానికి ఏటా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతాలతోపాటు బాలకార్మికుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నాం. బాల కార్మికులు కనిపిస్తే ప్రజలు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించారు. బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం.
– బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
ఆపరేషన్ స్మైల్ ద్వారా విముక్తి పొందిన బాలబాలికలు
సంవత్సరం బాలురు బాలికలు బాలకార్మికులు బాల్యవివాహాలు డ్రాపౌట్స్ మొత్తం
2022 92 9 98 2 1 101
2023 42 1 37 0 06 43
2024 63 5 59 3 06 68
2025 54 3 52 1 04 57


