నూతనోత్సాహంతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం నూతన సంవత్స ర వేడుకలు నిర్వహించారు. న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఇప్పటి వర కు ఉత్పత్తి, నాణ్యతలో ముందంజలో ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 90 రోజుల్లో ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాన్ని 100 శాతం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారులు సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


