జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కౌటాల: కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న దనూరి విజ య్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ హరికృష్ణ తెలిపారు. మండల కేంద్రంలోని పాఠశాలలో గురువారం విజయ్ ను ఉపాధ్యాయులు అభినందించారు. హెచ్‌ఎం రాంచందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ నెల 5 నుంచి 7 వరకు రాజస్తాన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు విజయ్ ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. ఉపాధ్యాయులు రమేశ్, సంధ్యారాణి, సింధు, సుశీల తదితరులు పాల్గొన్నారు.


