
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ పంచాయతీ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. రెండు నెలలుగా వారికి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 51 వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కూటికల ఆనంద్‌రావు, కార్మికులు సంతోష్, స్వామి, నగేశ్, మల్లేశ్, సాగర్, శ్రీకాంత్, జైవంత్ తదితరులు పాల్గొన్నారు.