
పల్లె ఓటర్లు 3,53,895 మంది
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం మంగళవారం పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లోని 2,874 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉన్న ట్లు వెల్లడించింది. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉ న్నారని జిల్లా పంచాయతీ అధి కారి భిక్షపతిగౌడ్ తెలిపారు. ఆగ స్టు 31 వరకు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం మా ర్పులు, చేర్పులు చేసి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తుది జాబితాను అధికారులు ప్రదర్శించారు. ముసాయిదా జాబితా నుంచి ఆసిఫాబాద్ మండలంలో తొమ్మిది మంది పేర్లు తొలగించినట్లు డీపీవో పేర్కొన్నారు. గత పంచాయతీ ఎన్నికల ముందు జిల్లాలో 3,48,329 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 10న ఎంపీటీసీ స్థానాల వారీగా తుది ఓటరు జాబితాను ప్రకటించనున్న విషయం తెలిసిందే.
మండలాల వారీగా పంచాయతీ ఓటర్లు
మండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
ఆసిఫాబాద్ 15,039 15,276 0 30,315
బెజ్జూర్ 11,685 12,047 2 23,734
చింతలమానెపల్లి 12,118 11,837 0 23,955
దహెగాం 11,014 11,077 1 22,092
జైనూర్ 11,936 12,427 0 24,363
కాగజ్‌నగర్ 22,857 22,383 2 45,242
కెరమెరి 12,145 11,880 1 24,026
కౌటాల 13,796 13,560 1 27,357
లింగాపూర్ 5,103 5,479 1 10,583
పెంచికల్‌పేట్ 6,218 6,084 0 12,302
రెబ్బెన 14,523 14,201 0 28,724
సిర్పూర్(టి) 11,016 11,163 3 22,182
సిర్పూర్(యూ) 5,835 6,440 2 12,277
తిర్యాణి 8,863 9,281 4 18,148
వాంకిడి 14,458 14,134 3 28,595