
స్కాలర్‌షిప్ విడుదల చేయాలని ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ 18 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ గురుకులాలకు పక్కా భవనాలు మంజూరు చేయాలన్నారు. వసతిగృహాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని, సరిప డా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ధర్నా అనంతరం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు సుంకరి సా యి, కార్తీక్, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగా, అనుమతి లేకుండా విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయానికి వచ్చే ప్రజలను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.