
వినాయకా.. వెళ్లి రావయ్యా
ఆసిఫాబాద్‌అర్బన్: తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. లంబోదరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచిన ఆసిఫాబాద్ పట్టణవాసులు నిమజ్జనం కోసం పెద్దవాగుకు తరలించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తిగీతాలకు నృత్యాలు చేశారు. వివిధ కాలనీల్లో కొలువుదీరిన 60 విగ్రహాలను వివేకానందచౌక్, అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, బ్రాహ్మణవాడ, రావులవాడ, రాజంపేట, కంచుకోట మీదుగా ప్రత్యేక వాహనాల్లో శోభాయాత్రగా పెద్దవాగుకు తరలించారు. ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా బజార్‌వాడీ సమర్థసాయి గణేశ్ మండలి వద్ద ఎస్పీ కాంతిలాల్ పాటిల్ స్వామివారికి పూజలు చేశారు. ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి బైక్‌పై తిరుగుతూ బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలతో పెద్దవాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
లడ్డూ వేలం.. అ‘ధర’హో..
బ్రాహ్మణవాడ సార్వజనిక్ గణేశ్ మండలి వద్ద నిర్వహించిన వేలంపాటలో స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని సింగాడె అశోక్ రూ.12,516కు దక్కించుకోగా, స్వామి వారి మెడలోని హారాన్ని నిమ్మకంటి సంతోష్ రూ.16,400కు దక్కించుకోన్నారు. వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కాచం గణేశ్ రూ.34,516కు, కరెన్సీ మాలను ముత్యాల ప్రదీప్ రూ.29,516కు దక్కించుకున్నారు. వేడుకలను ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షించారు.
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని మోతుగూ డ, బూర్గుడతోపాటు పలు గ్రామల్లో శుక్రవా రం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. శిశుమందిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని వాగులో నిమజ్జనం చేశారు.

వినాయకా.. వెళ్లి రావయ్యా

వినాయకా.. వెళ్లి రావయ్యా

వినాయకా.. వెళ్లి రావయ్యా