
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తోడ్పాటునందిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఆసిఫాబాద్ మండలం బూర్గుడకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కుందారపు రాణికి రూ.10లక్షలతో మంజూరైన మొబైల్ చేపల విక్రయ వాహనాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ప్రారంభించారు. రూ.4లక్షల సొంత నిధులు, రూ.6లక్షలు ప్ర భుత్వ రాయితీతో సంచార వాహ నం నిర్వహించేందుకు ముందుకురావడం సంతో షంగా ఉందన్నారు. డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, డిస్ట్రిక్ ప్రాజె క్టు మేనేజర్లు యశోద, యాదగిరి పాల్గొన్నారు.
గ్రామ పాలనాధికారులను సకాలంలో
తీసుకురావాలి
ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించే నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి గ్రామ పాలనాధికారులకు సకాలంలో తీసుకురావాలని రాష్ట్ర ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేశ్‌కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్‌లతో సమీక్షించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ జిల్లాకు చెందిన 59 మంది గ్రామ పాలనాధికారులకు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఈ నెల 5న ఉదయం 4 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.
అభివృద్ధి దిశగా జిల్లాను నడిపించాలి
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాను ఆ కాంక్షిత నుంచి అభివృద్ధి వైపు నడిపించాలని నీతి ఆయోగ్ సీఈవో మణివేలు అన్నారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి ఆకాంక్షిత జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్పరెన్స్ నిర్వహించారు. నీతిఆయోగ్ ద్వారా చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ తిర్యాణి బ్లాక్‌లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.