
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: పండగలన్నీ ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, మార్కెట్ ఏరియా, అంబేడ్కర్ చౌరస్తా, లారీ చౌరస్తా మీదుగా పెట్రోల్ పంప్ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు లాంగ్‌మార్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాన్ ఉన్ నబి పండుగలు సామరస్యంగా జరుపుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, అన్నిప్రాంతాల్లో నిఘా ఉంటుందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.