
పనులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్‌లో శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అంతకుముందు వందరోజులు పనిచేసిన ఉపాధి కూలీలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీ ఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో బుచ్చయ్య, డీఎల్‌పీవో హుస్సేన్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ తదితరులు పాల్గొన్నారు.