
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్ట్రంలోని అంశాలపై ఖాన్ అకాడమీ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఖాన్ అకా డమీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, విద్యార్థులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకా రం కృత్యాలు సాధన చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లు భరత్‌రావు, సమ్మయ్య, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.