
23న రాష్ట్రస్థాయి ధర్నా
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 23న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్లు యూఎస్‌పీసీ రాష్ట్ర నాయకులు చరణ్‌దాస్, వైద్య శాంతికుమారి పిలుపునిచ్చారు. పట్ట ణంలో బుధవారం మహాధర్నా పోస్టర్ ఆవి ష్కరించారు. వారు మాట్లాడుతూ పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జాడికేశవ్, రాజ్‌కమలాకర్, మహిపాల్, మహేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.