
మట్టి వినాయకుడు.. పర్యావరణ పరిరక్షకుడు
చింతలమానెపల్లి: వినాయక చవితి ఉత్సవా లకు భక్తులు సిద్ధమవుతున్నారు. గణనాథు డి విగ్రహాలకు తుది మెరుగులు దిద్దే పనిలో కళాకారులు నిమగ్నమయ్యారు. గతంలో ఇళ్లలో ప్రతిష్టించే విగ్రహాలను కుమ్మరి కళాకారులు తయారు చేసే మట్టి విగ్రహాలకు కాల క్రమేణా ఆదరణ తగ్గింది. రంగులతో మురిపించే విగ్రహాలు పర్యావరణానికి హానికరంగా మారుతుండటం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై స్పృహ పెరగడంతో మళ్లీ మట్టి విగ్రహాలకు ఆదరణ వస్తోంది. చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామంలో కుమ్మరి కళాకారులు మట్టి విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇళ్లలో ప్రతిష్టించేందుకు వీలుగా మంచిర్యాల, కాగజ్‌నగర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఆర్డర్‌పై తీసుకెళ్తున్నారు.
కూలి మాత్రమే గిట్టుబాటు
కుమ్మరి కళాకారులకు మట్టి పని మాత్రమే ఉపాధి. వినాయక విగ్రహాల తయారీకి సిర్పూర్(టి) మండలం లోనవెల్లి నుంచి మట్టి తీసుకొస్తాం. మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. కానీ రోజుల తరబడి పని చేసినా కూలి మాత్ర మే గిట్టుబాటవుతుంది. ఎక్కువగా ఆర్డర్లు వస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మట్టి వినాయకుల వినియోగానికి ప్రచారం చేసి, కులవృత్తిగా ఉన్న విగ్రహాల తయారీని ప్రోత్సహించాలి.
– శంకర్, రుద్రాపూర్
– మరిన్ని కథనాలు 8లోu

మట్టి వినాయకుడు.. పర్యావరణ పరిరక్షకుడు