
కార్మికుడి వారసులకు చెక్కులు అందజేత
రెబ్బెన: సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడి వారసులకు బుధవారం ఏకమొత్తం చెక్కును గోలేటి లోని జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి అందజేశారు. గోలేటి 1ఏ గనిలో కోల్‌కట్టర్‌గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో గులాం మృతి చెందాడు. అతని వారసులైన యూసుఫ్ అలీ, మాసుం అలీ వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారు మెడికల్ ఫిట్ సాధించలేకపోవడంతో ఏకమొత్తం చెల్లింపు కోసం యాజమాన్యానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆదాయపు పన్నును మినహాయింపు కాగా ఒక్కొక్కరికి రూ. 6.25 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం రాజేశ్వర్‌రావు, ఏఐటీయూసీ నాయకులు కిరణ్, జూనియర్ అసిస్టెంట్ బాబా, తదితరులు పాల్గొన్నారు.