
బీజేపీకి నాయకుల రాజీనామా
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సీనియర్ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారా యణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా కోఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, కాగజ్‌నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు రవికాంత్‌తోపాటు సుమారు 500 మంది కార్యకర్తలు రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో పార్టీలో త్వరలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.