
తప్పని నిరీక్షణ
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. ఓ వైపు అధికారులు కొరత లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎరువులు సరిపడా అందడం లేదు. పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని గోదాం వద్దకు మంగళవారం పెంచికల్‌పేట్, ఎల్లూర్, ఎల్కపల్లి, కొండపల్లి, కమ్మర్‌గాం గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించారు. అలాగే సిర్పూర్(టి) మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కూపన్ల కోసం క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాశారు. సరిపడా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. – పెంచికల్‌పేట్/సిర్పూర్(టి)

తప్పని నిరీక్షణ