
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట
● రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
జైనూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యౖ మెన విద్యనందించడంతోపాటు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉ మ్మడి జిల్లా ఇన్‌చార్జి, ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. జైనూర్ మండలం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం గురుకుల నిద్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డార్ఫ్ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన చిత్రాల వివరాలు తెలు సుకున్నారు. చరిత్ర పుస్తకాలు ప్రింట్ చేయించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల వసతిగృహానికి చేరుకున్నారు. భోజన వివరాలు అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిద్, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్ పాల్గొన్నారు.
‘ఉపాధ్యాయులదే బాధ్యత’
ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాలలు, వసతిగృహా ల్లో విద్యార్థుల హాజరు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావాలని, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ప్రకారం హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సెలవుపై వెళ్లే ఒకరోజు ముందు అనుమతి తీసుకోవాలన్నారు. ఎస్‌వోలు శ్రీనివాస్, అబిద్ అలీ, ఉదయ్‌బాబు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను మంగళవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. విద్యార్థుల హాజరుశాతం, వంటశా ల, ప్రయోగశాలను పరిశీలించారు. అనంత రం జన్కాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎంఈవో సుభాష్, ఎస్‌వో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ ఉన్నారు.