
ప్రతీనెల ఒకటిన వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతీనెల గ్రీన్ చానల్ ద్వారా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో మా ట్లాడారు. పంచాయతీ కార్మికులకు ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని చట్టపరంగా రావాల్సిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఏటా రెండు జతల యూనిఫామ్స్, సబ్బులు, ష్యూస్ అందజేయాలని తెలిపారు. సమస్యల ను పలుమార్లు డీపీవో దృష్టికి తెచ్చినా స్పంద న లేదని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షులు నాగేశ్, విలాస్, పుష్పలత, సహాయ కార్యదర్శులు సోనేరావు, శంకర్, వసంత్, అనిల్ పాల్గొన్నారు.