
కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ కాంతిలాల్‌పాటిల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికా ర్డులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఆయుధాల భద్ర త, కేసుల వివరాలు పరిశీలించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. మ హిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామానుజం, సీఐ ప్రేంకుమార్, సిబ్బంది ఉన్నారు.