
బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం
రెబ్బెన(ఆసిఫాబాద్): కొత్త గనుల ఏర్పాటుతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం రానుందని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన వేదిక శిలాఫలకం ఆవిష్కరించారు. ఏరియాలో ఉత్తమ కార్మికులుగా ఎంపికైన వారిని సన్మానించి బహుమతులు ప్ర దానం చేశారు. జీఎం మాట్లాడుతూ గోలేటి, మాదారం ఉపరితల గనుల ఏర్పాటు ద్వారా ఏరియాకు పూర్వవైభవం రానుందన్నారు. ఉద్యోగుల కుటుంబాల కోసం ఐదు కొత్త బో రుబావుల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న ట్లు తెలిపారు. ఏరియాకు నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 95 శాతం ఉత్పత్తి సాధించా మన్నారు. కార్యక్రమాల్లో సేవా అధ్యక్షురాలు పద్మ విజయ భాస్కర్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం అధ్యక్షుడు నరేందర్, ఎస్‌వోటూజీఎం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.