
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
ఆసిఫాబాద్‌రూరల్: విధి నిర్వహణతోపాటు ప్రజల కు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎఫ్‌డీవో దేవిదాస్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్‌తో కలిసి రక్తదానం చేశారు. అటవీశాఖలో విధులు ఎన్నో సవాళ్లతో కూడుకుందన్నారు. వాటిని అధిగమిస్తూనే ప్రజలకు సేవ చేయాలని సూచించారు. రక్తదాన శిబిరంలో 62 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు అజ్మత్, రేంజ్ అధికారులు గోవింద్‌చంద్ సర్దార్, అనిల్‌కుమార్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీరాణి, చంద్రమోహన్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.