
అమరుల త్యాగాలను స్మరిద్దాం
ఆసిఫాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర పోరాటంతో ఎందరో మహానుభావులు జీవితాలు, ప్రాణాలను త్యా గం చేశారని, అలాంటి అమరులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరా లకు తెలియజేయాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలు లేకుండా నిజమైన స్వేచ్ఛను అనుభవించలేమని తెలిపారు. ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత చూపాలని సూచించా రు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన తొ మ్మిది మంది పోలీసు అధికారులకు సేవా పతకాలు అందించి అభినందించారు. కాగజ్‌నగర్ సీఐ రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ ఎస్సై శ్రీనివాస్, భరోసా సెంటర్ మహిళా ఎస్సై తిరుమల, కాగజ్‌నగర్ ఏఎస్సై బాలాజీ, హెడ్ క్వార్టర్ ఏఎస్సై శ్రీనివాస్, హెడ్ క్వార్టర్ హెడ్ కానిస్టేబుల్ ఇమామా, బిశ్వజిత్ మాగి, సిర్పూర్ హెడ్ కానిస్టేబుల్ అజీమొద్దీన్, ఏఆర్ హెడ్‌క్వార్టర్ నాందేవ్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం తదితరులు పాల్గొన్నారు.