
విజయనగరం ఎయిడెడ్ పాఠశాల పరిశీలన
కౌటాల(సిర్పూర్): సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశా ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేయడంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘తలో దిక్కు..!’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం కౌటాల మండలంలోని విజయనగరం ఎయిడెడ్ పాఠశాల భవనాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి సజీవన్, కౌటాల తహసీల్దార్ ప్రమోద్ పరి శీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భవనాన్ని పరిశీలించినట్లు వారు తెలిపారు. విజయనగరం ఎయిడెడ్ పాఠశాలలో మొత్తం 16 తరగతి గదులు, నాలుగు వసతి గదులు, వంట గది, డైనింగ్ హాల్, ఆడిటోరియం, ఐదెకరాల క్రీడా మైదానం ఉందన్నారు. జిల్లా అధికారులు విజయనగరం పాఠశాలను గురుకుల విద్యార్థుల కోసం ఎంపిక చేస్తే 15 రోజుల్లో పాఠశాల భవనాలకు మరమ్మతులు చేసి అప్పగిస్తామని పాఠశాల కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఉన్నారు.
ఎఫెక్ట్..

విజయనగరం ఎయిడెడ్ పాఠశాల పరిశీలన