
రైతుల పాదయాత్రకు మద్దతు
చింతలమానెపల్లి: ‘మా భూములు మాకే ఇవ్వాలి’ అంటూ హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టిన చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ రైతులకు బుధవారం పలువురు నాయకులు మద్దతు పలికారు. ప్రజ్ఞాపూర్ వద్ద ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పోడు రైతులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా లక్సమక్కపల్లి వద్ద రైతులను కలిసి ఆర్థికసాయం అందించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గజ్వేల్ నియోజకవర్గం ములుగు వద్ద హైదరాబాద్ రహదారిలో కలిసి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. పోడు పట్టాలిచ్చి అటవీ అధికారుల ఆగడాల నుంచి రైతులకు రక్షణ కల్పించాలని, రైతు భరోసా, రైతుబీమా, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.