
విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలి
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని డీఈవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను మంగళవారం సందర్శించారు. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. తరగతి గదిలో కూర్చుని గణితం పాఠం విన్నారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టా రు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతతో నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఏఎంవో ఉప్పులేటి శ్రీనివాస్, ఏపీడీ వెంకట్, ఎంఈవో ఆడే ప్రకాశ్, ఎంపీడీవో అంజద్‌పాషా, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు చంద్రశేఖర్, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.