
కాగజ్‌నగర్‌లో ‘వందేభారత్’కు హాల్టింగ్ ఇవ్వాలి
కాగజ్‌నగర్‌టౌన్: సికింద్రాబాద్– నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్‌కే శ్రీవాస్తవ్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. అలాగే కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన జీఎం శ్రీవాస్తవ్ ఆధునికీకరణకు రూ.19 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌లోని సంజీవయ్య కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.9 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. చింతగూడ– ఈజ్‌గాం రైల్వే క్రాసింగ్ ఎత్తు పెంచి ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరగా, రైల్వే స్పెషల్ ప్రాజెక్టుగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.120 కోట్లతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు