
విధులకు వెళ్తుండగా ప్రమాదం..
కౌటాల మండల కేంద్రానికి చెందిన ధన్‌రాజ్ సిర్పూర్(టి) గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇక్కడి ఇంటర్ విద్యార్థులను మంచిర్యాల జిల్లాలోని కాసిపేటకు తరలించారు. విధులకు హాజరు కావడానికి తొలిరోజు కౌటాల నుంచి కాగజ్‌నగర్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో కాగజ్‌నగర్ మండలం కోసిని సమీపంలో రోడ్డుపై ఉన్న పందిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో ధనరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. దూరభారం కారణంగానే ఉపాధ్యాయుడు గాయపడినట్లు తోటి అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.