
బీమా.. రైతన్నకు ధీమా!
రైతుబీమాతో బాధిత కుటుంబాలకు రూ.5లక్షల భరోసా ఈ నెల 13 వరకు పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం రైతువేదికల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏఈవోలు కొత్తవారితోపాటు తప్పుల సవరణకు అవకాశం
రైతు పొలానికి సంబంధించిన పట్టా పాసుపుస్తకం ఉండాలి.
ఆధార్‌కార్డులో వయస్సు 18 నుంచి 59 ఏళ్లు ఉండాలి.
2025 జూన్ 5లోగా పట్టా పాసుపుస్తకం పొందిన వారు మాత్రమే అర్హులు.
పట్టాదారు పాసు పుస్తకా లు ఉండి గతేడాది నమోదు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
రైతులు స్వయంగా కార్యాలయానికి వెళ్లి అధికారి సమక్షంలో దరఖాస్తు అందజేయాలి. పట్టా పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లు ఈ నెల 13లోగా సమర్పించాలి.
ఇప్పటికే ఎల్‌ఐసీ ఐడీ కలిగిన రైతులకు రెన్యువల్ అవుతుంది. పొరపాట్లు ఉంటే రైతులు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి సవరించుకోవాలి.
● రైతుబీమాతో బాధిత కుటుంబాలకు రూ.5లక్షల భరోసా ● ఈ నెల 13 వరకు పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ● రైతువేదికల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏఈవోలు ● కొత్తవారితోపాటు తప్పుల సవరణకు అవకాశం
కౌటాల(సిర్పూర్): ఆపత్కాలంలో అన్నదాతల కు టుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది రైతుబీమా పథకం. వివిధ కారణాలతో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2025– 26 సంవత్సరానికి గాను అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామాల్లో వ్యవసాయ విస్తారణ అధికారులు పథకంపై కొత్త పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 13 వరకు గడువు ఉండగా.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన వారు రైతుబీమా పథకానికి అర్హులు. ఇటీవల వరుస సెలవులు రావడంతో నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. వ్యవసాయ పనులతో రైతులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, బీమా పథకం రైతుకు మంచి ప్రయోజనకరంగా ఉంది. ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా సాధారణ మరణాలతో సహా నామినీకి 15 రోజుల్లోగా రూ.5లక్షల ప్రమాద బీమా సొమ్ము అందిస్తున్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ ద్వారా దీనిని అమలు చేస్తున్నారు.
2018లో పథకం ప్రారంభం
రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు 2018 ఆగస్టు 14న అప్పటి ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రారంభించింది. జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, 1,42,596 మంది రైతులు ఉన్నారు. ఇందులో రైతుబీమా పథకానికి అర్హులైన 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వారు దాదాపుగా 90 వేల మందికి పైగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. పథకం ప్రారంభమై ఏడేళ్లు కావొస్తుండగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రెండు వేల మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.వంద కోట్ల వరకు నగదును చెల్లించారు. పోడు పట్టాలు పొందిన రైతులు సైతం రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా రైతుబీమా పథకం ఏటా ఆగస్టు 14న మొదలై వచ్చే ఏడాది ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగుస్తుంది. గతేడాది రెన్యువల్ చేసిన పాలసీ ఈ నెల 13తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, పాత వాటిని రెన్యువల్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది.
కౌలు రైతులపై చిన్నచూపు
రైతుబీమా పథకం వందల ఎకరాలు ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం వర్తింపజేస్తుండగా, కౌలు రైతులపై చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టడంతో రైతుల కుటుంబాలకు భరోసా కలిగింది. కౌలుకు భూములు సాగు చేస్తున్న రైతులకు సైతం ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని వారు కోరుతున్నారు.
అర్హతలు ఇవే..
రైతు పొలానికి సంబంధించిన పట్టా పాసుపుస్తకం ఉండాలి.
ఆధార్‌కార్డులో వయస్సు 18 నుంచి 59 ఏళ్లు ఉండాలి.
2025 జూన్ 5లోగా పట్టా పాసుపుస్తకం పొందిన వారు మాత్రమే అర్హులు.
పట్టాదారు పాసు పుస్తకా లు ఉండి గతేడాది నమోదు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
రైతులు స్వయంగా కార్యాలయానికి వెళ్లి అధికారి సమక్షంలో దరఖాస్తు అందజేయాలి. పట్టా పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లు ఈ నెల 13లోగా సమర్పించాలి.
ఇప్పటికే ఎల్‌ఐసీ ఐడీ కలిగిన రైతులకు రెన్యువల్ అవుతుంది. పొరపాట్లు ఉంటే రైతులు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి సవరించుకోవాలి.
రైతులు దరకాస్తు చేసుకోవాలి
పట్టా పాసుపుస్తకం ఉండి 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు రైతు బీమా చే యించుకోవాలి. పాసుపుస్తకం జిరాక్స్‌తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలతో స్వయంగా రైతులే ఏఈవోల వద్దకు వెళ్లాలి. ఇతరులు వెళ్తే వివరాలు నమోదు చేయరు. రైతుబీమా పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఈ నెల 13లోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఎ లాంటి సందేహాలు ఉన్న స్థానిక వ్యవసా య శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
– శ్రీనివాసరావు, డీఏవో

బీమా.. రైతన్నకు ధీమా!

బీమా.. రైతన్నకు ధీమా!