రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి గనుల ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో భూనిర్వాసితులు, నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డితో చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ సింగరేణిలో భూములు కోల్పోయిన నిర్వాసితులను సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలన్నా రు. రోడ్ల మరమ్మతులు, రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్తవాటి నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పన, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా గోలేటి పరిసర గ్రామాల ప్రజలు, భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జీఎం ఎమ్మెల్యేకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.