
బడి ప్రారంభం.. ఆదివాసీల హర్షం
కెరమెరి(ఆసిఫాబాద్): ఏళ్లుగా పాఠశాల లేక ఇబ్బందులు పడిన ఆదివాసీల కల ఎట్టకేలకు నెరవేరింది. కెరమెరి మండలంలోని మారుమూల గ్రామం పాటగూడలో సోమవారం మోడి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఇస్తావత్ ప్రేందాస్, ఎస్‌ఈఆర్‌పీ చహకటి శ్యాంరావు గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. గతంలో స్కూల్ అందుబాటులో లేకపోవడంతో 3, 4వ తరగతి చిన్నారులు బాబేఝరి, జోడేఘాట్‌లోని ఆశ్రమ పాఠశాలలకు వెళ్లేవారు. కానీ 1, 2వ తరగతి పిల్లలు మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. ఈ విషయాన్ని పలు మార్లు ‘సాక్షి’లో ప్రచురించగా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో 14 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు.