
నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు
ఆసిఫాబాద్‌రూరల్: చిన్నారుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమ వారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలురు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం ద్వారా వారిలో రక్తహీనత, పోషకాహార లోపం, ఇతర అనారోగ్య సమస్యలు నివారించవచ్చన్నారు. జిల్లాలో 1,07,702 మంది 19 ఏళ్లలోపు వారికి మాత్రలు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, వైద్య సిబ్బంది ఉన్నారు.
సౌర విద్యుత్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు మూడు రోజుల్లో నివేదికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, పోడు పట్టా భూములకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం అమలుపై సమీక్షించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన స్థలం, వైశాల్యం, విద్యుత్ వినియోగం వివరాలతో నివేదికలు రూపొందించాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని పొదుపు చేయాలని, జిల్లాకు ఆరు వేల ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు.
‘స్వాతంత్య్ర’ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జిల్లాలో ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘ నంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణను అదనపు కలెక్టర్, ఆర్డీవో, అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. మైదానంలో సంక్షేమ పథకాల శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప టిష్ట బందోబస్తు చేపట్టాలన్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే