
దళితుల భూములు ఆక్రమిస్తే ఫిర్యాదు చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: దళితుల భూములు ఆక్రమణకు గురైతే వెంటనే కమిషన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సజీవన్, కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, తహసీల్దార్ మధుకర్, ఎంపీడీవో కోటప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ పుష్పగుచ్ఛం, మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. రాంచందర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 338 ద్వారా షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు విశేష అధికారాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.