
ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటే లాభాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): పోటీ ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గిస్తేనే సింగరేణి సంస్థకు లాభాలు వస్తాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నా రు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాల యం కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం మల్టీ డిపార్టుమెంటల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్థను మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేందుకే యాజమాన్యం మల్టీ డిపార్టుమెంటల్ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. సింగరేణితో పోల్చితే మహా రాష్ట్రలోని డబ్యుసీఎల్‌లో టన్నులకు రూ.2వే ల తక్కువ వ్యయంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు రవాణా టన్నుకు రూ.5 వ్యయం అవుతోందన్నారు. సింగరేణిలో ప్రస్తుతం 22 భూగర్భ గనులు, 17 ఓసీపీలు కొనసాగుతుండగా, త్వరలో నాలుగైదు భూగర్భ గనులు మూతబడుతాయని తెలిపారు. దీంతో సింగరేణికి లాభమే తప్ప నష్టం ఉండదన్నారు. నా ణ్యమైన బొగ్గును తక్కువ రేటుతో అందిస్తేనే సింగరేణి మనుగడలో ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌వోటూజీఎం రాజ మల్లు, పీవో నరేందర్, డీజీఎం ఉజ్వల్‌కుమార్, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, డీవైపీఎం రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.