
‘ఆదాయం వెల్లడించక పోవడం సరికాదు’
తిర్యాణి(ఆసిఫాబాద్): చింతలమాదర జలపాతానికి వచ్చే ఆదాయం వెల్లడించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని ఏకో టూరిజం కమిటీ(ఈటీసీ) చైర్మన్ తుంరం గోపాల్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పర్యాటకుల కోసం జలపాతం వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. టికెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయాన్ని 80 శాతం జలపాతం అభివృద్ధి, 20 శాతం పంచాయతీ అభివృద్ధికి వినియోగించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు కృష్ణ, నాగు, అర్జున్, సాగర్, సోము తదితరులు పాల్గొన్నారు.