
ఎస్టీ హోదా కల్పించే వరకు పోరాటం
కాగజనగర్‌టౌన్: మాలీ కులస్తులకు ఎస్టీ హోదా కల్పించే వరకు పోరాటం చేస్తామని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌రావు అన్నారు. కాగజ్‌నగర్‌లోని జ్యోతిబా పూలే భవనంలో ఆదివారం మాలీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 2022లో అసెంబ్లీలో మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసిందని అ న్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మాలీ కులస్తులకు న్యాయం చేయకుంటే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్‌రావు, హన్మంతు, వాసుదేవ్, శ్రీనివాస్, తిరుపతి, రంగశ్రీనివాస్, నిరంజన్ పాల్గొన్నారు.